Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

వచ్చే ఎన్నికల్లో పోటీచేయను.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ఏడాదిన్నరలో తెలంగాణ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలకు సంబంధించి టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి (జగ్గారెడ్డి) బుధవారం సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని తెలిపారు. తన స్థానంలో సంగారెడ్డి కార్యకర్తలకే అవకాశమిస్తామన్నారు. తన సతీమణి నిర్మలతో కలిసి బుధవారం పార్టీ కార్యకర్తలతో భేటీ అయిన సందర్భంగా జగ్గారెడ్డి ఈ ప్రకటన చేశారు. తనకు బదులుగా సంగారెడ్డికి చెందిన పార్టీ కార్యకర్తను బరిలోకి దించేందుకు పార్టీ శ్రేణులు ఒప్పుకోకపోతే… తన స్థానంలో తన సతీమణిని పోటీ చేయిస్తానని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పిన జగ్గారెడ్డి… 2028లో జరిగే ఎన్నికల్లో మాత్రం సంగారెడ్డి నుంచి తానే పోటీ చేస్తానని ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img