Monday, September 26, 2022
Monday, September 26, 2022

వజ్రోత్సవాలను జయప్రదం చేయండి..

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సెప్టెంబర్‌ 16,17,18 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జయప్రదం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు గారు పిలుపునిచ్చారు. మంగళవారం అసెంబ్లీ లోని కాన్ఫరెన్స్‌ హాల్‌ లో ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల సమన్వయంతో అత్యంత వైభవంగా వేడుక నిర్వహించాలని మంత్రి ఈ సందర్బంగా ప్రజా ప్రతినిధులు, అధికారులకు సూచించారు. వజ్రోత్సవాల విజయవంతానికి ప్రతీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఎప్పటికపుడు సమీక్ష చేసుకుంటూ మూడు రోజుల వేడుక పకడ్బందీగా నిర్వహించలన్నారు.
సమీక్షలో ఎంపీ ప్రభాకర్‌ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌ రెడ్డి గారు, మహిపాల్‌ రెడ్డి గారు, మదన్‌ రెడ్డి గారు, మాణిక్‌ రావు గారు, ఒడితెల సతీష్‌ గారు, క్రాంతి గారు, భూపాల్‌ రెడ్డి గారు, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి గారు, చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మెన్‌ చింత ప్రభాకర్‌ గారు, మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌ గారు, సంగారెడ్డి కలెక్టర్‌ శరత్‌ గారు, సిద్దిపేట కలెక్టర్‌ ప్రశాంత జీవన్‌ పాటిల్‌ గారు, అదనపు కలెక్టర్‌ ముజిమిల్‌ ఖాన్‌ గారు, గడా ఛైర్మెన్‌ ముత్యం రెడ్డి గారు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img