Monday, January 30, 2023
Monday, January 30, 2023

వడ్లు కొనాలని రైతులు.. ప్రధాని మోదీకి ట్వీట్లు చేయాలి

హరీష్‌రావు
కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ మహా ధర్నా చేపట్టింది. సిద్దిపేటలో జరిగిన ధర్నాలో మంత్రి హరీష్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘పోరాటం ఇప్పుడే మొదలైంది.. ఇది ఆరంభమే.. మున్ముందు మరింత ఉధృతం చేస్తాం’ అంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ అసమంజస విధానాలు తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారుతున్నదని అన్నారు. ఏడేళ్ల టీఆర్‌ఎస్‌ హయాంలో రైతులకు మేలు జరుగుతున్నదని.. నేడు కాళేశ్వరంతో ఏ ఊర్లో చూసిన చెరువులు అన్ని నిండు కుండల్లా కళకళలాడుతున్నాయని అన్నారు. ‘పంజాబ్‌లో మొత్తం వడ్లు మొత్తం ఎలా కొంటారు..?.. తెలంగాణలో ఎందుకు కొనరు..?. దేశంలో రైతుకు పెట్టుబడి సాయం, బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఒక్క వ్యవసాయం మీదనే ప్రభుత్వం 30 వేళ కోట్లు ఖర్చు చేస్తున్నది. నాడు రైతు కళ్ళల్లో కన్నీళ్లే.. నేడు ఏడేళ్ల టీఆర్‌ఎస్‌ హయాంలో ఎక్కడ చూసినా నీళ్లే.. నీళ్లు.’ అని అన్నారు. దేశంలో జై జవాన్‌ జై కిసాన్‌ నినాదం ఉండేది.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నై కిసాన్‌ అంటున్నదన్నారు. దేశంలో వడ్లు కొనాల్సిన భాద్యత కేంద్రానిదే.. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటిసారి వడ్లు కొనబోమని చెప్పిన ఘనత బీజేపీదే అన్నారు. ఇప్పటికైనా కేంద్రం పద్ధతి మార్చుకోకపోతే.. రైతుల కోపాగ్నికి కమలం వాడిపోక తప్పదన్నారు. వడ్లు కొనాలని రైతులు.. ప్రధాని మోదీకి ట్వీట్లు చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img