Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

వణికిస్తున్న సడెన్‌​ హార్ట్‌ ఎటాక్స్‌..

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కుప్పకూలిన ప్లేయర్‌
ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా సడెన్‌ గా గుండెపోటు వచ్చి కుప్పకూలుతున్న ఘటనలు అందరినీ కలవరపెడుతున్నాయి. హైదరాబాద్‌ లో ఇలాంటి విషాద ఘటన మరోటి జరిగింది. లాలాపేటలో పరమేష్‌ యాదవ్‌(38) అనే వ్యక్తి ఇండోర్‌ స్టేడియంలో బ్యాడ్మింటన్‌ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కొన్ని రోజుల కిందట హైదరాబాద్‌ లోనే ఓ కానిస్టేబుల్‌ జిమ్‌ చేస్తూ ఇలానే గుండెపోటుతో మృతి చెందాడు. నిర్మల్‌ జిల్లాలో 19 ఏళ్ల కుర్రాడు పెళ్లిలో డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. దాంతో, సడెన్‌ హార్ట్‌ ఎటాక్స్‌ పై రాష్ట్రంలో ఆందోళన మొదలైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img