Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

వరదనీటిలో చిక్కుకున్న స్కూలు బస్సు

మహబూబ్‌నగర్‌ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వరదలు ఇబ్బందికరంగా మారాయి. దీంతో ఒక చోట భాష్యం టెక్నో స్కూలుకు చెందిన స్కూలు బస్సు చిక్కుకుపోయింది. ఆ సమయంలో బస్సులో 25 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. స్కూలు బస్సు మాచన్‌పల్లి – కోడూరు మధ్య వెళ్తుండగా వరదలో చిక్కుకుంది. మహబూబ్‌ నగర్‌ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అండర్‌ బ్రిడ్జిలో వరద నీరు భారీగా నిలిచి పోయింది. ఆ వరద నీటిలోకి బస్సు వెళ్లడంతో అందులో చిక్కుకుపోయింది. ముందుకు లేదా వెనక్కి బస్సు వెళ్లలేని స్థితిలో డ్రైవర్‌ వెంటనే విద్యార్థులను క్షేమంగా బయటికి తీశారు. స్థానికులు కూడా వెంటనే స్పందించి నడుము లోతుకు పైగా ఉన్న నీటిలో దిగి పిల్లల్ని బయటకు తీసుకొచ్చేందుకు సాయం చేశారు. తర్వాత స్కూలు బస్సును ట్రాక్టర్‌ ద్వారా బయటికి లాగించారు. రామచంద్రపురం నుంచి సూగూరు తండాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img