Friday, September 22, 2023
Friday, September 22, 2023

వర్షాలు, వరదలపై కలెక్టర్లతో సీఎస్‌ సమీక్ష

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, ప్రస్తుత పరిస్థితులపై కలెక్టర్లతో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సమీక్షించారు. 20 జిల్లాల కలెక్టర్లతో పరిస్థితిపై టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెరువులు, కుంటలు, జలాశయాలు పూర్తిగా నిండాయని, అన్ని జలాశయాల వద్ద పరిస్థితిని పర్యవేక్షించాలని చెప్పారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, జలాశయాల పరీవాహక ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. అవసరమైతే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img