Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

వారంరోజుల్లో ఫీవర్‌ సర్వే పూర్తి చేస్తాం : సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

తెలంగాణ రాష్ట్రంలో ఫీవర్‌ సర్వే వారం రోజుల్లో పూర్తిచేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. ఈ సర్వేకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. నగంరలోని ఖైరతాబాద్‌లో జరుగుతున్న ఫీవర్‌ సర్వేను సీఎస్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఇతర అధికారులు పరిశీలించారు. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి వేగంగా ఉందని, కానీ పెద్దగా లక్షణాలు కనిపించడం లేదని అన్నారు. త్వరలో కేసులు తగ్గుముఖం పడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌ ఉన్నాయని స్పష్టంచేశారు. ఆరోగ్య తెలంగాణ కోసం వైద్య సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారన్నారు. ఫీవర్‌ సర్వేలో వైద్య సిబ్బంది ఐసోలేషన్‌ కిట్‌, గర్భిణులకు వైద్యసాయం, వ్యాక్సిన్‌ తీసుకోని వారికి వ్యాక్సిన్‌ ఇస్తున్నారని తెలిపారు. బూస్టర్‌ డోసు ఇప్పటివరకు 70 శాతం పూర్తయిందని సీఎస్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img