Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలి : మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌

వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి, ఎక్సైజ్‌, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం వారు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. వాల్మీకి బోయలను కొన్ని రాష్ట్రాలు ఎస్టీ, ఎస్సీ జాబితాలో చేర్చాయని పేర్కొన్నారు.వాల్మీకి బోయలు ఎస్టీ జాబితాలో చేర్చాలని 1956 నుంచి ఉద్యమాలు చేస్తున్నారని గుర్తు చేశారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసిన చెల్లప్ప కమీషన్‌ రిపోర్ట్‌ ఆధారంగా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితా లో చేర్చాలని సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపామని వెల్లడిరచారు.తదుపరి ప్రక్రియ కేంద్రం పరిధిలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించి బోయలకు న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ మాట్లాడుతూ వాల్మీకిబోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img