Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

వికారాబాద్‌ జిల్లాలో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం

వికారాబాద్‌ జిల్లాలో భూమి కంపించింది. జిల్లాలోని పరిగి మండలం రంగాపూర్‌, రంగాపూర్‌ తాండాల్లో భారీ శబ్ధంతో భూమి రెండు సెకన్ల పాటు కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరిగిందనే అయోమయంలో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. వికారాబాద్‌ జిల్లాలో గతంలోనూ భూమి కంపించింది. బంట్వారం మండల పరిధిలోని తొర్మామిడి, బొపునారం, కర్ణాటక సరిహద్దు గ్రామమైన పోచారం గ్రామాల్లో నెల క్రితం భూమి కంపించడంతో ఆయా గ్రామాల ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. తొర్మామిడికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చించోలి తాలుకాలోని కర్కిచెడ్‌ గ్రామంలో గత రెండు నెలల కింద భూమి కంపించింది. ఆ ఘటన మరువకముందే సరిహద్దు ప్రాంతంలో భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img