Wednesday, October 5, 2022
Wednesday, October 5, 2022

వికారాబాద్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

వికారాబాద్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ సాయంత్రం ప్రారంభించారు. కలెక్టరేట్‌లో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నేపల్లిలో సమీకృత కలెక్టరేట్‌కు 34 ఎకరాల భూమి కేటాయించగా రూ.60.70కోట్లు వెచ్చించి నిర్మాణం చేపట్టారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, కొప్పుల మహేశ్వర్‌ రెడ్డి, కాలే యాదయ్య, పైలట్‌ రోహిత్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, పట్నం మహేందర్‌ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img