Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

విజయ గర్జన సభకు స్థలాల పరిశీలన

టీఆర్‌ఎస్‌ పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చారిత్రక వరంగల్‌ నగరంలో ఈ నెల 15వ తేదీన విజయ గర్జన సభ పెట్టాలని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్‌ నిర్ణయించారు. దాదాపు 10 లక్షల మందితో భారీ ఎత్తున సభను ఈ సభ నిర్వహించి, విజయవంతం చేయాలని పార్టీ ముఖ్యనేతలకు సూచించారు.ఇందులో భాగంగా వరంగల్‌ నగర సమీపంలోని శివారు ప్రాంతాలు మడికొండ, ఉనికిచర్ల, రాంపూర్‌ వద్ద ఖాళీ స్థలాలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, ఇతర స్థానిక నేతలతో కలిసి సోమవారం పరిశీలించారు. ఎలాంటి ఆటంకాలు కలుగకుండా అన్ని హంగులతో సభ నిర్వహించేందుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img