Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

విజయ డెయిరీని విస్తరిస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం : మంత్రి తలసాని

విజయ డెయిరీ టర్నోవర్‌ రూ. 750 కోట్లకు చేరిందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. రూ. 4 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వడం వల్ల పాల రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి తలసాని సమాధానమిచ్చారు. రోజుకు 162.68 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. పాలిచ్చే పశువుల పంపిణీ పథకాన్ని ప్రారంభించామన్నారు. ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీ పాడి రైతులకు 75 శాతం సబ్సిడీ, ఇతర లబ్దిదారులకు 50 శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు. రూ. 246.25 కోట్లతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల గ్రామంలో మెగా డెయిరీకి శంకుస్థాపన చేశామన్నారు. విజయ డెయిరీని విస్తరిస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. ాల రైతుల సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుందన్నారు. మొబైల్‌ వెహికల్స్‌ అందించామన్నారు. వెటర్నరీ హాస్పిటల్‌తో పాటు సంచార వాహనాలను ఏర్పాటు చేసి మెడిసిన్స్‌ను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img