వరంగల్ జిల్లాలో హిందీ ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన అంశంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా తీశారు. నిజాలు తేల్చేందుకు సీపీకి ఫిర్యాదు చేయాలని వరంగల్, హనుమకొండ డీఈవోలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వరంగల్ డీఈవో వాసంతి సీపీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హిందీ క్వశ్చన్ పేపర్ ఏ స్కూల్ నుంచి బయటకు పంపించారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ తెలిపారు.