Friday, September 30, 2022
Friday, September 30, 2022

విద్వేషం కోసం.. అధర్మం కోసం అనేది.. బీజేపీ అసలు రాజకీయ విధానం : కేటీఆర్‌

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ ప్రభుత్వం కాదని.. ఇది అటెన్షన్‌ డైవర్షన్‌ ప్రభుత్వమని విమర్శించారు. అసలు దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర జరుగుతోందన్నారు. మండిపోతున్న పెట్రో ధరల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్రేనని కేటీఆర్‌ ఆరోపించారు. భారమవుతున్న నిత్యవసరాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర అని, ఊడిపోతున్న ఉద్యోగాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర అన్నారు. ఈ కుట్రను కనిపెట్టకపోతే.. దేశానికే, భవిష్యత్‌ తరాలకు కోలుకోలేని నష్టమన్నారు. దేశం కోసం.. ధర్మం కోసం.. అనేది బీజేపీ అందమైన నినాదమని, విద్వేషం కోసం.. అధర్మం కోసం.. అనేది అసలు రాజకీయ విధానమని ఆరోపించారు. పచ్చగా ఉన్న తెలంగాణాలో చిచ్చు పెట్టె చిల్లర ప్రయత్నం జరుగుతోందని, విష ప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. సోషల్‌ మీడియా ద్వారా దేశంలోని.. సోషల్‌ ఫ్యాబ్రిక్‌ను దెబ్బతీసే కుతంత్రం జరుగుతోందన్నారు. ద్వేషం కాదు.. దేశం ముఖ్యమని, ఉద్వేగాల భారతం కాదు.. ఉద్యోగాల భారతం ముఖ్యమని గుర్తుంచుకోవాలని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img