Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత..ప్రాథమిక చికిత్స చేసిన గవర్నర్‌ తమిళిసై

గవర్నర్‌ తమిళిసై ఆపదలో ఉన్న సాధారణ విమాన ప్రయాణీకుడికి అత్యవసర చికిత్స అందించి ప్రశంసలు అందుకున్నారు. వివరాల్లోకి వెళితే, గవర్నర్‌ తమిళసై వారణాసికి వెళ్లారు. తిరిగి హైదరాబాద్‌ కు వచ్చే క్రమంలో ఢల్లీి- హైదరాబాద్‌ విమానంలో బయల్దేరారు. అర్ద్రరాత్రి వేళ ప్రయాణిస్తున్న ఆ విమానంలో సాధారణ ప్రయాణీకురాలు లాగానే తమిళసై తోటి ప్రయాణీకులతో పాటుగా కూర్చున్నారు.ఆ సమయంలో ఒక ప్రయాణీకుడు అస్వస్థతకు గురయ్యారు. తనకు ఛాతీ నొప్పిగా ఉందని.. గాలి ఆడటం లేదని విమాన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే విమాన సిబ్బంది.. ప్రయాణీకుల్లో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా అంటూ అనౌన్స్‌ మెంట్‌ ద్వారా ప్రశ్నించారు. దీంతో..వెంటనే ప్రయాణీకుల్లో ఉన్న గవర్నర్‌ తమిళసై స్పందించారు. వెంటనే ప్రయాణీకుడికి బీపీ చెక్‌ చేయటంతో పాటుగా.. ప్రాధమిక చికిత్స అందించారు. దీంతో..ఆయన వెంటనే తేరుకున్నారు. అస్వస్థతకు గురైన ప్రయాణీకుడికి సమస్య వివరించి.. ఓదార్పు ఇచ్చారు. కావాల్సిన మందులు అందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img