London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Thursday, October 10, 2024
Thursday, October 10, 2024

‘విశాఖ ఉక్కు’ ప్రైవేటీకరణ కుట్రలు ఆపండి

కేంద్రానికి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ
బీఆర్‌ఎస్‌ పార్టీగా అడ్డుకుని తీరతామని హెచ్చరిక

హైదరాబాద్‌ : విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని, కార్పొరేట్‌ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలు మానుకోవాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే కుట్రలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉందని మండిపడ్డారు. ఇప్పటికే విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలన్న కుట్రలను ఎప్పటికప్పుడు అక్కడి కార్మికులు, అనేక ఇతర సంఘాలు, బీఆర్‌ఎస్‌ వంటి పార్టీలు అడ్డుకుంటున్న నేపథ్యంలో తాజాగా కేంద్రం దొడ్డిదారిన ప్రైవేటుకు కట్టబెట్టే కుతంత్రానికి తెరలేపిందని వెల్లడిరచారు. వర్కింగ్‌ క్యాపిటల్‌, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట విశాఖ ఉక్కును ప్రైవేట్‌ కంపెనీలకు అప్పజెప్పేందుకు ఏకంగా నోటిఫికేషన్‌ జారీ చేసిందని తెలిపారు. కేంద్రం కుట్రలను బీఆర్‌ఎస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. బీజేపీ… తన ఎజెండా అమలు కోసం మాత్రమే విశాఖ ఉక్కును క్రమంగా చంపే ప్రయత్నం ఎప్పటినుంచో చేస్తోందన్నారు. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పేరిట గతిశక్తి వంటి కార్యక్రమాలతో ముడిపెట్టి కేంద్రం గొప్పలు చెప్పుకుంటోంది కానీ మౌలిక వసతుల ప్రాజెక్టులకు అత్యంత కీలకమైన స్టీల్‌ ఉత్పత్తిని పూర్తిగా ప్రైవేటుపరం చేయాలని చూడటం కేంద్ర ప్రభుత్వ నిబద్ధత లోపాన్ని తేటతెల్లం చేస్తుందని స్పష్టంచేశారు. ఒకప్పుడు ప్రభుత్వ రంగంలో భారీ ఎత్తున సిమెంట్‌ను ఉత్పత్తి చేసిన పరిశ్రమలన్నింటిని పూర్తిగా ప్రైవేటుపరం చేసిన కేంద్రంలోని ప్రభుత్వాలు, ప్రస్తుతం స్టీల్‌ పరిశ్రమను కూడా అదే రీతిన ప్రైవేట్‌ కంపెనీలకు అప్పజెప్పేందుకు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఇందులో భాగంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పూర్తిగా ప్రైవేటుపరం చేసే ముందు, దాన్ని నష్టాల పాలుచేసి, వాటిని సాకుగా చూపించి లక్షల కోట్ల విలువైన ఆస్తులను అప్పనంగా ప్రైవేట్‌ కార్పొరేట్‌ మిత్రులకు అప్పజెప్పేందుకు కేంద్రం కుట్ర చేస్తుందన్నారు. అందులో భాగంగానే స్టీల్‌ప్లాంట్‌కు అవసరమైన ప్రత్యేక ఐరన్‌ ఓర్‌ గనులను కేటాయించకుండా కేంద్రం మోకాలడ్డిందని తెలిపారు. దీంతో విశాఖ ఉక్కు తన ఉత్పత్తి ఖర్చులో 60 శాతం వరకు పూర్తిగా ముడిసరుకుపైనే ఖర్చు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు ప్రైవేట్‌ కంపెనీలకు ఇబ్బడిముబ్బడిగా ఐరన్‌ ఓర్‌, బొగ్గు, ఇతర గనులను కేటాయించడం వల్ల వారి ఉత్పత్తిలో ముడి సరుకుల ఖర్చు కేవలం 40 శాతం లోపే ఉన్నదని చెప్పారు. పెద్ద ఎత్తున ముడి సరుకు పైనే ఖర్చు చేయాల్సి రావడంతో.. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఉత్పత్తి విషయంలో ప్రైవేట్‌ కార్పొరేట్‌ కంపెనీలతో పోటీపడటంలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని, మార్కెట్‌లో వాటితో సమాన ధరకు అమ్మాల్సి రావడంతో నష్టాలను ఎదుర్కొంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.
వర్కింగ్‌ క్యాపిటల్‌ పేరుతో…
వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ కి 7.3 ఎంటీపీఏ సామర్థ్యం ఉన్నా… కేవలం ముడి సరుకును, మూలధనాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల పూర్తిస్థాయి కెపాసిటీతో పనిచేయలేకపోతోందని తెలిపారు. ప్రస్తుతం పని చేస్తున్న 50 శాతం సామర్థ్యానికి కూడా 100 శాతం కెపాసిటి ఉత్పత్తికి అయ్యే ఖర్చే అవుతుందని మంత్రి చెప్పారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తే పూర్తిస్థాయి సామర్థ్యంతో పని చేయడం వల్ల అనేక ఖర్చులు కలిసి వచ్చి విశాఖ ఉక్కు లాభాల బాట పడుతుందని స్పష్టంచేశారు. ఇప్పటికైనా విశాఖ ఉక్కును వర్కింగ్‌ కాపిటల్‌ పేరుతో ప్రైవేట్‌ కంపెనీలతో కలిపే ప్రయత్నాన్ని పూర్తిగా విరమించుకోవాలని కేటీఆర్‌ హితవు పలికారు. దీనికి బదులు కేంద్ర ప్రభుత్వమే అందుబాటులో ఉన్న ఇతర మార్గాల ద్వారా కర్మాగారాన్ని బలోపేతం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) దాదాపు రూ.లక్ష కోట్లతో తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించిందని చెప్పారు. లక్ష కోట్ల రూపాయలతో గ్రీన్‌ ఫీల్డ్‌లో భారీ విస్తృత ప్రణాళిక ప్రకటించిన ఈ సంస్థను వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌తో కలపవచ్చని సూచించారు. దీంతో తక్కువ ధరకి ప్రైవేట్‌ సంస్థలకు అమ్మడం కంటే కేంద్ర ప్రభుత్వమే ఇంకో ప్రభుత్వ రంగ సంస్థతో కలపడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. సెయిల్‌ సంస్థ విస్తరణ లక్ష్యానికి కూడా ఇది ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. సెయిల్‌ ఈ దిశగా ముందుకు వస్తే తెలంగాణ ప్రభుత్వం ఎన్నాళ్లుగానో డిమాండ్‌ చేస్తున్న బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు కడపలోనూ మరో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఈకో సిస్టం ఏర్పడుతుందన్నారు.
రుణ సౌకర్యం కల్పించాలి
దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన విశాఖ ఉక్కు ప్రస్తుతం దాదాపు రూ.25వేల కోట్ల వరకు మాత్రమే రుణాల మానిటైజేషన్‌ చేసుకోవడానికి కేంద్రం అవకాశం కల్పించిందని తెలిపారు. అయితే అదే స్థాయిలో ఆస్తులు లేదా విలువ కలిగిన ప్రైవేట్‌ కంపెనీలకు మాత్రం దాదాపు 70 నుంచి 80 వేల కోట్ల రూపాయల వరకు రుణాలను పొందగలిగే సౌకర్యాన్ని కల్పించిందన్నారు. ప్రైవేట్‌ కంపెనీలతో సమానంగా కేంద్ర ప్రభుత్వం రుణ సౌకర్యాన్ని కల్పించి, బ్యాంకుల ద్వారా మరింత మూలధనాన్ని ఇప్పిస్తే వైజాగ్‌ విశాఖ ఉక్కు తన కార్యకలాపాలను ప్రైవేటు కంపెనీలతో సమానంగా పోటీపడేలా నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చొరవ చూపాలని కోరారు.
తక్షణం రూ.5వేల కోట్లు ఇవ్వాలి
కేంద్ర ప్రభుత్వమే తక్షణం వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కి అవసరమైన మేరకు కనీసం రూ.5వేల కోట్లు కేటాయించాలని కేటీఆర్‌ సూచించారు. గతంలో ప్రధాన మంత్రులుగా పనిచేసిన పీవీ నరసింహారావు, అతల్‌ బిహారీ వాజ్‌పేయిల హయాంలో ఇదేవిధంగా వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కి నిధులను నేరుగా కేటాయిం చిన ఉదంతాలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కోరుతున్నట్టు.. సుమారు రూ.5 వేల కోట్లు కేటాయించి, అందుకు సరిపడా ఈక్విటీని కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చన్నారు.
ఆ నోటీసును రద్దుచేయాలి
ప్రస్తుతం మూలధనం అందించి స్టీల్‌ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనే పేరుతో ఏర్పాటు చేసిన ఆసక్తి వ్యక్తీకరణ నోటీసును కేంద్రం వెంటనే రద్దు చేయాలన్నారు. దీని బదులు కేంద్ర ప్రభుత్వమే దేశంలో భారీ ఎత్తున చేపడుతున్నామని చెప్పుకుంటున్న మౌలిక వసతుల ప్రాజెక్టులకు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి నేరుగా స్టీల్‌ని కొనుగోలు చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి అడ్వాన్స్‌ సొమ్ములను అందించి, స్టీల్‌ కోనుగోలు చేస్తే సరిపోతుందన్నారు.
ప్రజలను చైతన్యవంతం చేస్తాం
బీఆర్‌ఎస్‌ పార్టీగా వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడాలన్న చిత్తశుద్ది తమకు ఉన్నదని మంత్రి కేటీఆర్‌ స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా తమ అనుకూల ప్రైవేట్‌ కంపెనీకి వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ని అప్పజెప్పాలన్న కుట్రను చేస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. దీన్ని ఎదుర్కొని వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు, ఉద్యోగాల భవిష్యత్తును కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో వారితో కలిసి పని చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకోసం కలిసి వచ్చే శక్తులు, ప్రజాసంఘాలు, పార్టీలతో కలసి ప్రజలను మరింత చైతన్యవంతం చేస్తామన్నారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ తెలుగు ప్రజల హక్కు అని, దాన్ని కాపాడుకోవడం కోసం తెలుగువారందరు కలిసి రావడం అవసరమని భావిస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img