తెలంగాణలో రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వైఎస్‌ఆర్టీపీ చర్యలు తీసుకుంటోంది.పార్టీని ప్రక్షాళన చేసే క్రమంలో ఇప్పటి వరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్టు ఆ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రకటించారు. కమిటీల స్థానంలో జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమిస్తున్నట్టు తెలిపారు. . గత ఏడాది పార్టీని ప్రకటించిన తర్వాత పార్లమెంటు నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమించారు. రాష్ట్ర స్థాయిలో అధికార ప్రతినిధులను, సోషల్ మీడియా ఇన్చార్జీలను నియమించారు. అయితే ఇప్పుడు అన్ని కమిటీలను ఒక్కసారిగా రద్దు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.