Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

వైఎస్‌ షర్మిలను, బీజేపీని టార్గెట్‌ చేసిన ఎమ్మెల్సీ కవిత..

ఎమ్మెల్సీ కవిత రెండు పార్టీలను టార్గెట్‌ చేసి సెటైరికల్‌ ట్వీట్‌ చేశారు. షర్మిల తానా అంటే బీజేపీ నేతలు తందానా అంటున్నారని ఎమ్మెల్సీ కవిత పరోక్షంగా ఎద్దేవా చేశారు. తాము వదిలిన బాణం తానా అంటే తందానా అంటున్న తామరపువ్వులు అంటూ ట్వీట్‌ చేశారు. ఇక తన ట్విట్టర్‌ ద్వారా వైయస్సార్‌ తెలంగాణా పార్టీ, బీజేపీ రెండూ ఒకటేనని అర్థం వచ్చేలా కవిత పోస్ట్‌ చేశారు. వైయస్‌ షర్మిల వెనుక బీజేపీ నేతలు ఉన్నారని, బీజేపీనే వైయస్‌ షర్మిలను నడిపిస్తుంది అన్నట్టుగా కవిత ట్వీట్‌ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img