: మంత్రి సత్యవతి
ఎయిడ్స్ డే సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాటు అవగాహన ర్యాలీని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఎయిడ్స్ రహిత సమాజానికి పాటుపడాలని అన్నారు. ప్రజలు వైద్యాధికారుల సూచనలు పాటిస్తూ ఎయిడ్స్ నియంత్రణకు సహకరించాలన్నారు. అనంతరం రక్తదాన శిబిరాలలో పాల్గొన్న విద్యార్థులకు రక్త దాతలకు ప్రశంసాపత్రాలను అందించారు.