Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగింది


సీఎం కేసీఆర్‌
రాష్ట్రంలో పెద్దఎత్తున వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించడంతో పాటు, అనేక కష్టాలకోర్చి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో నదీజలాలను చెరువులకు, బీడు భూములకు ప్రభుత్వం మళ్లించిందని సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో ఒక్క ఎకరం కూడా వదలకుండా, వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములను రైతులు సాగు చేస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్‌లో రెండో రోజు జరిగిన కేబినెట్‌ సమావేశంలో వ్యవసాయ శాఖపై చర్చించారు. ఈ సందర్భంగా గత ఏడాది కాలంలో వ్యవసాయ రంగంలో జరిగిన పురోగతి, ధాన్యం దిగుబడి, సాగు విస్తీర్ణం పెంపు, తదితర విషయాలను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి, ఆ శాఖ అధికారులు కేబినెట్‌కు వివరించారు. వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో, విత్తనాలు ఎరువుల లభ్యత, వర్షాపాతం తదితర అంశాల పైనా కేబినెట్‌ చర్చించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img