Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

వ్యాక్సినేషన్‌ ..ఒక ఉద్యమంగా చేపట్టాలి : సీఎస్‌

వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. రెండు వారాల్లో హైదరాబాద్‌ను వందశాతం కోవిడ్‌ వాక్సినేషన్‌ జరిగిన నగరంగా రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. నగరంలోని అన్ని కాలనీలను వందశాతం వాక్సినేషన్‌ కాలనీలుగా తీర్చిదిద్దేందుకు శాసనసభ్యులు, స్థానిక కార్పొరేటర్ల ను భాగస్వాములను చేయాలని, అలాగే జీహెచ్‌ఎంసీ, ఆరోగ్యశాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయముతో వ్యవహరించాలని సీఎస్‌ అధికారులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ గ్రేటర్‌ పరిధిలో ఉన్న 4 జిల్లాల కలెక్టర్లు, జి హెచ్‌ ఎం సి జోనల్‌ కమీషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, డీఎంహెచ్‌ఓ లు, ఎస్పిహెచ్వోలతో జరిగిన వర్క్‌ షాప్‌లో సీఎస్‌ మాట్లాడారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img