Friday, March 31, 2023
Friday, March 31, 2023

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రెడ్‌ అలెర్ట్‌


గణతంత్ర వేడుకలు సమీపిస్తుండడంతో శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. జనవరి 26న ఉగ్రకుట్ర జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల ముందస్తు హెచ్చరికలతో దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌ పోర్ట్‌లలో భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అనుమానిత వ్యక్తులు, వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలోనే భద్రతా దళాలు శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ లో భద్రతను కట్టుదిట్టం చేసి, ఎవరైనా అనుమానంగా సంచారించిన, డ్రోన్‌ కెమెరాలు వినియోగించినా తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలని ఎయిర్‌ పోర్టు సమీప గ్రామాల ప్రజలకు సిఐఎస్‌ఎఫ్‌ అధికారులు సూచించారు. ఈ నెలాఖరు వరకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img