Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో 5 కిలోల బంగారం పట్టివేత

స్మగ్లర్లు రోజురోజుకు తెలివి మీరి పోతున్నారు. కొత్తదారులు వెతుక్కుంటూ మరీ అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా భారీగా బంగారం స్మగ్లీన్‌ చేస్తున్న ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ లో భారీగా బంగారం పట్టుబడిరది. దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడు పెద్ద ఎత్తున గోల్డ్‌ అక్రమంగా హైదరాబాద్‌ కు తెచ్చారు. దీంతో ఎయిర్‌ పోర్ట్‌ లో వారి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్‌ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో వారిని తనిఖీ చేశారు. వారి వద్ద దాదాపుగా 5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img