Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

‘శాకుంతలం’ రిలీజ్‌ డేట్‌ వాయిదా .. అధికారిక ప్రకటన!

త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌ చెబుతామని వెల్లడి
సమంత ప్రధానమైన పాత్రను పోషించిన ‘శాకుంతలం’ కోసం ఆమె అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఆ దిశగా పోస్టర్లను వదులుతూ .. అప్‌ డేట్స్‌ ఇస్తూ వచ్చారు.
ఈ సినిమా నుంచి ఒక పాట తరువాత ఒక పాటను వదులుతూ వెళుతున్నారు. ఈ సినిమాను ఒక విజువల్‌ వండర్‌ గా తీర్చిదిద్దారనే విషయం ఈ పాటల ద్వారానే అందరికీ అర్థమైపోయింది. ఈ తరహా కథలపై దర్శకుడిగా గుణశేఖర్‌ కి గల పట్టుకు .. మెలోడీ గీతాలపై మణిశర్మకి గల పట్టుకు ఈ సినిమా ఒక ఉదాహరణగా నిలవడం ఖాయమని అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఈ నెల 17న థియేటర్లకు రావడం లేదనీ, త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌ ను ఎనౌన్స్‌ చేస్తామని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుందనే ఆనందంతో ఉన్న అభిమానులకు నిరాశను కలిగించే వార్తనే ఇది. దిల్‌ రాజు నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ సినిమా నుంచి, మరో ఎనౌన్స్‌ మెంట్‌ ఎప్పుడు వస్తుందనేది చూడాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img