ఆత్మహత్య చేసుకున్న ఆదుకోవాలన్న డిమాండుతో దీక్ష చేస్తున్న వైఎస్సార్ టీపీ నాయకురాలు షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా షర్మిల దీక్షను భగ్నం చేశారు.షర్మిల సహా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు మూడున్నర గంటల పాటు షర్మిల దీక్ష కొనసాగింది. అంతకముందు ఆమె మాట్లాడుతూ, రైతు రవి కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిహారం ఇచ్చేవరకూ దీక్ష కొనసాగుతుదని అన్నారు. స్వయంగా సీఎం పేరు చెప్పి రైతు రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. దీనికి కేసీఆర్ సమాధానం చెప్పి, సీఎం పదవికి రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. హవేలిఘనపూర్ మండలం బొగుడు భూపతిపూర్‌లో షర్మిల దీక్ష చేశారు.