Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

షర్మిల నిందలు వేయడం దురదృష్టకరం : జగ్గారెడ్డి

షర్మిల తనపై నిందలు వేయడం దురదృష్టకరమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఉంటుందన్నారు. ఏపీలో మూడు రాజధానులు కాకుంటే మూడు రాష్ట్రాలు చేసుకోండని జగ్గారెడ్డి అన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. ముగ్గురు సీఎంలను పెట్టుకోండన్నారు. వైజాగ్‌ లో విజయసాయిరెడ్డి కబ్జాలకు పాల్పడ్డారన్నారు. తనను కోవర్ట్‌ అనడం సరికాదన్నారు. తాను కోవర్టునో కాదో తర్వాత సమాధానం చెబుతానని, విజయమ్మకు తాను ఓ సలహా ఇస్తున్నాన్నారు. షర్మిలను సీఎం చేయాలనుకుంటే..జగన్‌కు నచ్చజెప్పి ఏపీలో సీఎంగా చేయాలని జగ్గారెడ్డి అన్నారు. మీ ఇంట్లో ఉన్న వాళ్లంతా సీఎంలు కావాలా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img