: మంత్రి హరీశ్ రావు
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయణ్‌ఖేడ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు.. సంగారెడ్డి జిల్లా చరిత్రలోనే ఇది చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమం అన్నారు. సంగారెడ్డి జిల్లా అంటేనే తాగడానికి గుక్కెడు నీళ్లు లేని జిల్లా. సమైక్య రాష్ట్రంలో ఎవ్వరూ మన గురించి ఆలోచించలేదు. ఈరోజు మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికీ వస్తున్నాయి. 24 గంటల నాణ్యమైన కరెంట్ వచ్చింది. రోడ్లు వచ్చాయి. సాగునీరు కూడా ఇప్పుడు రాబోతోంది..మన గురించి సీఎం కేసీఆర్ ఆలోచించి.. 4000 కోట్ల రూపాయలతో 4 లక్షల ఎకరాలను సాగునీరు అందించే గొప్ప కార్యక్రమానికి శంకుస్థాపన చేశారని అన్నారు.