Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

సచివాలయం ప్రారంభానికి సర్వం సిద్ధం..

ప్రారంభోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ప్రశాంత్‌ రెడ్డి రాష్ట్ర గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 30న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అదేరోజు నుంచి కొత్త సచివాలయంలో పాలన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి ప్రశాంత్‌ రెడ్డి , డీజీపీ అంజనీ కుమార్‌, సీపీ సీవీ ఆనంద్‌ పరిశీలించారు. నిర్వాహకులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు.రాష్ట్ర గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 30న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అదేరోజు నుంచి కొత్త సచివాలయంలో పాలన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, డీజీపీ అంజనీ కుమార్‌, సీపీ సీవీ ఆనంద్‌ పరిశీలించారు. నిర్వాహకులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు.తెలంగాణ ప్రజలకు సుపరిపాలనను అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ 2019, జూన్‌ 27న కొత్త సచివాలయానికి శంకుస్థాపన చేశారు. ఇండో-పర్షియన్‌ నిర్మాణశైలిలో అత్యాధునిక హంగులతో నూతన భవనాన్ని నిర్మించారు. రాష్ట్ర హైకోర్టు తరహాలోనే సచివాలయంపై నిర్మించిన డోమ్‌లు, రెండు డోమ్‌లపై నిర్మించిన జాతీయ చిహ్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మొత్తం 34 డోమ్‌లను ఏర్పాటు చేయగా, సచివాలయానికి ముందు, వెనుక భాగాల్లో ఏర్పాటు చేసిన డోమ్‌లు అత్యంత ఎత్తైనవి. సుమారు 165 అడుగుల ఎత్తున ఉన్న డోమ్‌పై జాతీయ చిహ్నాలను ఏర్పాటు చేయడంతో సుదూర ప్రాంతంనుంచి కూడా ఇవి కనిపిస్తున్నాయి. రెండు గుమ్మటాలపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాలైన మూడు సింహాలతో దేశభక్తి, ఆత్మగౌరవ పతాకలా సచివాలయం తళుకులీనుతున్నది. ఇందులో నీటి సరఫరా కోసం హైడ్రో న్యుమాటిక్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ను అత్యవసర సమయాల్లో మాత్రమే ఉపయోగించేలా తగిన ఏర్పాట్లు చేశారు. వర్షపునీటిని స్టోర్‌ చేసేందుకు సంపును ఏర్పాటు చేశారు. భవనంపై పడిన నీటిచుక్కకూడా వృథాకాకుండా అవి సంపులోకి చేరేలా చేసి జలసంరక్షణ ప్రాధాన్యతకు సచివాలయాన్ని మార్గదర్శిలా తీర్చిదిద్దారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img