Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

సాగు విస్తీర్ణం పెరిగింది

మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి

వేల్పూర్‌ మండలం లక్కోర గ్రామం, భీంగల్‌ మండలం సికింద్రాపూర్‌ గ్రామాల్లో రూ.14 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మొత్తం 20 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల రెండు గోడౌన్లకు శుక్రవారం మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు.రూ. 24 లక్షల వ్యయంతో నిర్మించిన సికింద్రాపూర్‌ పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా సాగు నీరు, విరివిగా నిర్మించిన చెక్‌ డ్యాములు, చెరువులు పూడికతీత ద్వారా గ్రౌండ్‌ వాటర్‌ పెరిగి కొత్తగా ఏర్పాటు చేసుకుంటున్న బోర్ల ద్వారా ఎకరం కూడా బీడు లేకుండా సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు.బాల్కొండ నియోజకవర్గంలోని కిసాన్‌ నగర్‌ లో 5 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల ఒకే ఒక్క పాత గొడౌన్‌ ఉండేదన్నారు. కానీ కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే 11 కొత్త గొడౌన్స్‌ వచ్చాయన్నారు. ఇప్పటికే తొమ్మిది పూర్తయి వినియోగంలో ఉన్నవని తెలిపారు.కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img