Friday, August 12, 2022
Friday, August 12, 2022

సాలు మోదీ.. సంపకు మోదీ.. ప్రధానికి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు

జులై 2న ప్రధాని మోదీ హైదరాబాద్‌ కు వస్తున్న సంగతి తెలిసిందే. జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్‌ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు మోదీ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో మోదీకి వ్యతిరేకంగా హోర్డింగ్‌ లు, ఫ్లెక్సీలు వెలిశాయి.సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో భారీగా హోర్డింగ్‌లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. బైబై మోదీ అనే హాష్‌ ట్యాగ్‌తో టివోలీ థియేటర్‌ ఎదురుగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇందులో రైతు చట్టాలు తెచ్చి రైతులను చంపినవ్‌, నాలుగు సంవత్సరాల కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు మాత్రమే అని యువత కడుపు కొట్టినవ్‌, హఠాత్తుగా లాక్‌డౌన్‌ అని గరీబోల్లను చంపినవ్‌, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఉద్యోగులను రోడ్డు మీద పడేసినవ్‌, పెద్ద నోట్ల రద్దని సామాన్యుల నడ్డి విరిచావ్‌ అని, నల్లధనం వెనక్కి తెచ్చి అందరి ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు ఏవని ప్రశ్నించారు. అయితే ఈ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను ఎవరు ఏర్పాటుచేశారనే విషయం తెలియాల్సి ఉన్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img