Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసు పెంపునకు నిర్ణయం


సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసు పెంపునకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. కార్మికుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 26న జరిగే బోర్డు సమావేశంలో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని ఆదేశించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్‌ బెల్ట్‌ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు కార్మికుల పదవీ విరమణ వయసు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో మొత్తం 43, 899 మంది సింగరేణి కార్మికులు, అధికారులకు లబ్ధి చేకూరనున్నది. సింగరేణి ప్రాంత సమస్యలు- పరిష్కార అంశాలపై ఆ ప్రాంత పరిధిలోని ప్రజాప్రతినిధులతో ప్రగతి భవన్‌లో ఇవాళ సీఎం కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img