కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి కేటీఆర్ లేఖ
మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీకి లేఖ రాశారు. తెలంగాణలో నాలుగు బొగ్గు గనుల వేలం ఆపాలన్నారు. నాలుగు గనులను వేలం వేయకుండా సింగరేణికి కేటాయించాలని మంత్రి కేటీఆర్ లేఖలో కోరారు. సింగరేణి జోలికొస్తే కార్మికుల సెగ దిల్లీకి తాకుతుందన్నారు. ప్రభుత్వ సంస్థలను చంపేసే కుట్రకు బీజేపీ తెరలేపిందన్నారు. సింగరేణిని బలహీనపరిచి, నష్టాల సంస్థగా మాచ్చే కుట్ర చేస్తోందన్నారు. నష్టాలు చూపి చివరకు ప్రైవేటుపరం చేయాలని బీజేపీ పన్నాగం పన్నుతోందన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణి అభివృద్ధి చెందుతోంది. ఇప్పటివరకూ 16 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామాన్నరు. సింగరేణి కోల్‌మైన్ ఉద్యోగాల కల్పనలో గోల్డ్‌మైన్, గనులు మూతపడే కొద్దీ ఉద్యోగాలూ పోతాయి. సింగరేణిని కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.