Monday, February 6, 2023
Monday, February 6, 2023

సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి రాజీనామా

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి తన ఐఏఎస్‌ పదవికి రాజీనామా చేశారు. ఐఏఎస్‌ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) కోరుతూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు రాజీనామా లేఖ అందించారు. . అనంతరం వెంకట్రామిరెడ్డి రాజీనామాను ప్రభుత్వం ఆమోదించి, ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి సేవ చేస్తానని, కేసీఆర్‌ నుంచి పిలుపు వచ్చాక టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతానని వెంకట్రామిరెడ్డి ప్రకటించారు.
వెంకట్రామిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా ఓదెల. 1991లో గ్రూప్‌-1 ఆఫీసర్‌గా ప్రభుత్వ సర్వీసుల్లో వెంకట్రామిరెడ్డి చేరారు. బందర్‌, చిత్తూరు, తిరుపతిలో ఆర్డీవోగా పని చేశారు. మెదక్‌ జిల్లాలో డ్వామా పీడీగా సేవలందించారు. హుడా సెక్రటరీ, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌గా, సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఏడేండ్లు జేసీగా, కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి పని చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img