సీపీ వెల్లడి
సిద్ధిపేటలో చోటుచేసుకున్న కాల్పుల ఘటన ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సిద్దిపేట పోలీసు కమిషనర్ శ్వేత తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సీపీ శ్వేత మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడిరచారు. ప్రధాని నిందితుడు రాజు(26), సాయికుమార్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ. 34 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. మిగతా రూ. 10 లక్షలను అప్పులు తీర్చుకున్నట్లు నిందితులు వెల్లడిరచినట్లు సీపీ పేర్కొన్నారు. నిందితులు వినియోగించిన తుపాకులపై విచారణ కొనసాగుతోందన్నారు. స్పెషల్ టీమ్స్ సమర్థంగా పని చేశాయని సీపీ ప్రశంసించారు. జనవరి 31న సిద్దిపేట రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద కారు డ్రైవర్‌పై కాల్పులు జరిపి, రూ. 43.50 లక్షలను దోచుకెళ్లిన సంగతి తెలిసిందే.