Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

సిరిసిల్లను సంపూర్ణ సస్యశ్యామల జిల్లాగా చేస్తాం

మంత్రి కేటీఆర్‌
సిరిసిల్లను సంపూర్ణ సస్యశ్యామల జిల్లాగా చేస్తామని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.జిల్లాలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందించేలా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. జిల్లా సాగునీటి ప్రాజెక్టులు, ప్రతిపాదనలపై హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మంత్రి కే. తారకరామారావు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎమ్మెల్యేలు, సాగునీటి శాఖ ఉన్నతాధికారులు హాజరైనారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు జాలల రాకతో జిల్లాలో వ్యవసాయ సాగు పెరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతన ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ప్రస్తుత ప్రాజెక్టుల విస్తరణ ద్వారా సాధ్యమైనన్ని ఎక్కువ ఎకరాలకు సాగునీరు అందించాలన్న సీఎం కేసీఆర్‌ విజన్‌ మేరకే సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందించేలా ప్రయత్నం చేద్దామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img