Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

సీఎం కేసీఆర్‌తో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం : ఈటల రాజేందర్‌

తాను సభలో లేకుండా చేయాలన్న సీఎం కేసీఆర్‌ దుర్మార్గపు ఆలోచనే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెషన్‌ అని ఈటల రాజేందర్‌ అన్నారు. తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండా అని… 2014లో టీడీపీ, 2018లో కాంగ్రెస్‌ను మింగిన చరిత్ర కేసీఆర్‌దని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను పీకేలు కాపాడలేరని… తెలంగాణలో చైతన్యమే నిలిచి గెలుస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. గవర్నర్‌ను కాదు.. కేసీఆర్‌ అవమానిస్తోంది శాసనసభ మర్యాదను అని అన్నారు. సీఎం కేసీఆర్‌తో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని ఈటల సవాల్‌ విసిరారు. కేసీఆర్‌, హరీష్‌ రావుకు దమ్ముంటే బడ్జెట్‌పై తనతో చర్చకు రావాలన్నారు. హరీష్‌ రావుది దొంగలెక్కలు.. కాకి లెక్కల బడ్జెట్‌ అని కాగ్‌ నిబేదిక చెప్పిందని తెలిపారు. తాగుడు వలన తెలంగాణలో భర్తలు లేని ఆడబిడ్డలు పెరిగిపోతున్నారన్నారు. కార్మిక సంఘాలను రద్దు చేయించిన దుర్మార్గపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని విమర్శించారు. ఆర్టీసీ, మున్సిపల్‌ కార్మికులను కేసీఆర్‌ తొలగించాలన్నప్పుడు తాను అడ్డుపడ్డానని గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img