Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

సీఎం కేసీఆర్‌ బహిరంగ సభను విజయవంతం చేయండి

మంత్రి ఎర్రబెల్లి
ఈ నెల 20న జనగామలో జరిగే సీఎం కేసీఆర్‌ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమన్వయంతో చేస్తున్నామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు చెప్పారు. జనగామ జిల్లాలో సీఎం బహిరంగ సభ ఏర్పాట్ల సన్నాహక సమావేశాలు జరిగాయి. పాలకుర్తి, కొడకండ్ల మండలాల ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం పాలకుర్తి క్యాంప్‌ కార్యాలయంలో, దేవరుప్పుల మండల సమావేశం అదే మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్స్‌లో జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..జనగామ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని చెప్పారు. బహిరంగ సభ లో సీఎం తెలంగాణలో అమలు అవుతున్న, అభివృద్ధి, సంక్షేమాలను ప్రజలకు వివరిస్తారని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img