ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని, సమయం వచ్చినప్పుడల్లా కేంద్రంతో పోరాడుతున్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతులను పట్టించుకోలేదన్న వ్యాఖ్యలను ఆయన ఖండిరచారు.మూడేండ్లలో రూ. 3,384.95 కోట్ల రైతు బీమా పరిహారం అందించామని తెలిపారు. 67,699 మంది రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున అందించామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోనే రైతుల ప్రయోజనాలు కాపాడుతున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఏడాదికి రూ. 60 వేల కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఖర్చు చేస్తున్నాం. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని అన్నారు.