సీఎం కేసీఆర్ హయాంలోనే రైతాంగానికి అసలైన సంక్రాంతి పండుగ వచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల ద్వారా నిజమైన సంక్రాంతి వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా మంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. . సాగునీరందిస్తూ, 24 గంటలపాటు కోతలు లేని, నాణ్యమైన ఉచిత విద్యుత్‌ని అందిస్తూ, రైతుల రుణాలను మాఫీ చేస్తూ, రైతులకు ప్రభుత్వమే బీమా చేస్తూ, చివరకు పంటలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని చెప్పారు. 65లక్షల మంది రైతులకు 50వేల కోట్ల రైతు బంధు, 70వేల మంది రైతు కుటుంబాలకు 3,500 కోట్ల బీమా క్లెయిమ్ లు ఇస్తున్నామన్నారు. రైతాంగానికి ఉచిత విద్యుత్ కింద ఏటా 10వేల కోట్లు, పంటల కొనుగోలు కోసం 30వేల కోట్లు వెచ్చిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. సాగు విస్తీర్ణాన్ని 2 కోట్ల 4 లక్షల ఎకరాలకు పెంచి, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలపై 2లక్షల 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు.