Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఇవాళ కేబినెట్‌ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మహిళా యూనివర్సిటీ, సాగునీటి పారుదల రంగానికి చెందిన అంశాలు, ఉద్యోగులకు డీఏ పెంపు తదితర అంశాలపై కేబినెట్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.భారత్‌లో తెలంగాణ విలీనమై 74 ఏండ్లు పూర్తయ్యి 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో తెలంగాణ వజ్రోత్సవాల నిర్వహణ, పోడుభూముల సమస్య పరిష్కారం తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశమున్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా తెలంగాణపై ఆర్థిక ఆంక్షలు విధించిన నేపథ్యంలో అదనపు వనరుల సమీకరణపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img