Friday, June 9, 2023
Friday, June 9, 2023

సుదీర్ఘంగా కవిత విచారణ

. పదిన్నర గంటల పాటు ప్రశ్నించిన ఈడీ
. నేడు మళ్లీ రావాలని నోటీసు

న్యూదిల్లీ: దిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. సోమ వారం ఉదయం 10 గంటల 30 నిమిషా లకు ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన కవిత… రాత్రి తొమ్మిది గంటల 15 నిమిషాల వరకు అక్కడే ఉన్నారు. మధ్యలో కవిత అడ్వొకేట్లు ముగ్గురు ఈడీ కార్యాలయంలోకి ి వెళ్లడం… ఆ తర్వాత ఇద్దరు వైద్య సిబ్బంది కూడా వెళ్లి రావటం వంటి పరిణామాలతో తీవ్ర ఉత్కంఠ రేపింది. ఈడీ కార్యాలయం వెలుపల బారికేడ్లు పెట్టి పెద్ద ఎత్తున పోలీసుల బలగాలను మోహరించడం, అదే విధంగా ఎస్కార్ట్‌ వాహనాలు సైతం రావటంతో కవితను అరెస్టు చేస్తున్నారేమో అన్న అనుమా నాలు కలిగాయి. అయితే పదిన్నర గంటల సుదీర్ఘ విచారణ అనంతరం ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కవిత… విక్టరీ సింబల్‌ చూపుతూ తన వాహనంలో ఎక్కి వెళ్లిపోయారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా, వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లేతో కలిపి కవితను ఈడీ అధికారులు విచారించినట్లు సమాచారం. కాగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు మళ్లీ విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు కవితకు నోటీసు ఇచ్చారు.
అసలేం జరిగింది?
దిల్లీలోని సీఎం కేసీఆర్‌ నివాసం నుంచి సోమవారం ఉదయం 10.30 గంటలకే కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లారు. మొదటి అరగంట పాటు వివరాలు నమోదు, సంతకాలు తీసుకున్నాక సరిగ్గా 11 గంటలకు ఈడీ అధికారుల ఎదుట కవిత హాజరయ్యారు. 11 గంటల నుంచి సాయంత్రం 8 గంటల తర్వాత కూడా కవిత బయటికి రాలేదు. సాయంత్రం సమయంలో తెలంగాణ అడిషనల్‌ ఏజీ, సోమా భరత్‌, గండ్ర మోహన్‌ రావు ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కాగా మహిళలను సాయంత్రం ఆరు గంటల తర్వాత విచారించకూడదని ఈడీ నిబంధనలు చెబుతున్నా యంటూ కవిత ఇటీవల సప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. మనీలాండరింగ్‌ కేసు విచారణలో ఇంటి దగ్గరే మహిళలను విచారించాలన్న నిబంధ నను సైతం తన పిటిషన్‌లో ప్రస్తావించారు కవిత.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img