Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

సూర్యాపేటలో పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం చోరీ

దొంగలు ఏకంగా పోలీసుల వాహనాన్నే చోరీ చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. సూర్యాపేటలో కొత్త బస్టాండ్‌ వద్ద పోలీసులు పెట్రోలింగ్‌ వాహనాన్ని నిలిపి ఉంచారు. దాన్ని గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. తమ వాహనం కనిపించకపోవడంతో పోలీసులు షాకయ్యారు. గాలింపు చర్యలను మొదలు పెట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా వాహనం వెళ్లిన దారిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఏడాది నవంబర్‌ 5న ఒడిశా రాయగఢ్‌ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాన్ని ఒక దుండగుడు అపహరించాడు. ఆ తర్వాత పోలీసులు అతడిని గుర్తించి అరెస్ట్‌ చేశారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img