Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

సెప్టెంబర్‌ 3న టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం

సెప్టెంబర్‌ 3న తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరుగనున్నది. అనంతరం అదే రోజు టీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. శనివారం సాయంత్రం 5 గంటలకు తెలంగాణ భవన్‌లో భేటీ జరుగనున్నది. టీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సాగే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు సైతం పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతనంగా అమలు చేస్తున్న పెన్షన్లు, గిరిజనులకు పోడు భూములు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img