స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఐదు జిల్లాల్లోని ఆరు స్థానాలకు 26 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 37 పోలింగ్ కేంద్రాల్లో, 5,326 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.స్థానిక సంస్థల కోటాలో కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగుతోంది. సాయంత్రం 4 వరకు పోలింగ్ కొనసాగుతుంది.పోలింగ్ ప్రక్రియను వెబ్‌క్యాస్టింగ్ చేస్తున్నారు. ఈ నెల 14న ఓట్లు లెక్కించనున్నారు.