Sunday, February 5, 2023
Sunday, February 5, 2023

హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్‌ గెలుపు ఖాయం

: గుత్తా సుఖేందర్‌ రెడ్డి
ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని బీజేపీ కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని శాసన మండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నల్లగొండలో గుత్తా సుఖేందర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్‌ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఎన్ని కుతంత్రాలు చేసినా హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ గెలుపును ఆపలేరన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా మమతా బెనర్జీని ఎం చేయలేకపోయారని..ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సహజం, బీజేపీ ఓడిపోవడమూ అంతే సహజమని చెప్పారు.దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగని రోజే లేదన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని బీజేపీ గాలికొదిలేసిందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img