హెల్త్ వర్కర్లకు మాస్క్ లు, శానిటైజర్లు ఇవ్వట్లేదంటూ షర్మిల విమర్శ
ఇంటింటికి ఫీవర్ టెస్టులు చేసే హెల్త్ వర్కర్ల ప్రాణాలంటే పట్టింపు లేదా? వాళ్ల ప్రాణాలు లెక్క లేదా? అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటింటి ఫీవర్ సర్వే చేపడుతోన్న హెల్త్ వర్కర్లకు చీర కొంగులు.. కర్చీఫులు కట్టుకొని సర్వే చేయాలా అని ప్రశ్నించారు. కనీసం వాళ్లకు మాస్క్ లు, శానిటైజర్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందా ప్రభుత్వం? ప్రజల ప్రాణాల కోసం వారి ప్రాణాలను రిస్క్ లో పెట్టుకొని పనిచేస్తున్న హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వారియర్లకు మాస్క్ లు.. శానిటైజర్ల్ తో పాటు.. వారికి ఈ కరోనా కాలంలో జీతంతో పాటు స్పెషల్ బోనస్ ఇవ్వాలని, వారికి కరోనా సోకితే స్పెషల్ ట్రీట్మెంట్, ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.