Monday, March 27, 2023
Monday, March 27, 2023

హైదరాబాదులో తారకరత్న అంతిమయాత్ర ప్రారంభం

నేడు మహాప్రస్థానం శ్మశానవాటికలో అంత్యక్రియలు
హైదరాబాదులో సినీ నటుడు తారకరత్న అంతిమయాత్ర ప్రారంభమైంది. ఫిలించాంబర్‌ నుంచి ఆయన భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానం శ్మశాన వాటికకు తరలిస్తున్నారు. తారకరత్న అంతిమయాత్రలో సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతిమయాత్ర సందర్భంగా తారకరత్న పిల్లలు విలపించడం అందరినీ కలచివేసింది. కాగా, తారకరత్నకు కుమారుడు తనయ్‌ రామ్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నాడు.రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలోని నివాసం నుంచి ఈ ఉదయం తారకరత్న భౌతికకాయాన్ని ఫిలించాంబర్‌ కు తరలించడం తెలిసిందే. అభిమానులు భారీగా తరలివచ్చి తారకరత్నకు నివాళులు అర్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img