Monday, December 5, 2022
Monday, December 5, 2022

హైదరాబాద్‌లోని ముంచెత్తుతోన్న వర్షాలు

హైదరాబాద్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. అక్టోబర్‌ 12 బుధవారం రాత్రి వర్షం మళ్లీ దంచికొట్టింది. ఉరుములు మెరుపులతో నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఏకధాటిగా కుండపోత వానపడిరది. మునుపెన్నడూ లేనంత పిడుగుల మోతతో నగరం దద్దరిల్లింది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. అపార్ట్‌ మెంట్లు సైతం నీటి ముంపులో చిక్కుకున్నాయి. దీంతో కార్లు ద్విచక్రవాహనాలు బొమ్మల్లా కొట్టుకుపోయాయి. భారీ వరద రహదారులపైకి రావడంతో పలు ప్రాంతాల్లో వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఖైరతాబాద్‌.. బంజారాహిల్స్‌.. జూబ్లీహిల్స్‌.. అమీర్‌ పేట.. పంజాగుట్ట ..బేగంపేట్‌ ..యూసఫ్‌ గూడ.. షేక్‌ పేట్‌.. గచ్చిబౌలి.. హైటెక్‌ సిటీ ..ఆర్సీపురం.. రాజేంద్రనగర్‌.. బండ్లగూడ.. గొల్కొండ.. నార్సింగి పుప్పాలగూడ.. మైలార్‌ దేవులపల్లి ..మణికొండ.. గండిపేట.. షాద్‌ నగర్‌.. కూకట్‌ పల్లి ..నిజాంపేట.. బాచుపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img