Friday, August 12, 2022
Friday, August 12, 2022

హైదరాబాద్‌లో కుండపోత వర్షం

హైదరాబాద్‌ నగరంలో శుక్రవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు ఎండ, ఉక్కపోతగా ఉండగా.. హఠాత్తుగా మేఘాలు కమ్ముకుని కుండపోత వర్షం పడిరది. దీంతో అనేక ప్రాంతాల్లో వదర నీరు చేరుకుంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం బేగంపేట్‌, హిమాయత్‌ నగర్‌, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మియాపూర్‌, శేరిలింగంపల్లి, కేపీహెచ్‌బీ, కూకట్‌ పల్లి, కుత్బుల్లాపూర్‌ , సికింద్రాబాద్‌, సనత్‌ నగర్‌ ,అమీర్‌?పేట్‌, కొత్తపేట్‌, దిల్‌ సుఖ్‌ నగర్‌, మలక్‌ పేట్‌, చంపాపేట్‌, తార్నాక, ఉప్పల్‌, బోడుప్పల్‌, పీర్జాదీగూడ ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img