Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

హైదరాబాద్‌లో దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం

హైదరాబాద్‌లోని నాంపల్లిలో దారుణం జరిగింది. ఓ 13 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చిన ఇద్దరు యువకులు ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు.వివరాల్లోకి వెళితే, చంచల్‌గూడకు చెందిన బాధిత బాలికను అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు కారులో వచ్చి కిడ్నాప్‌ చేసి నాంపల్లిలోని ఓ లాడ్జీకి తీసుకెళ్లారు. అక్కడ బాలికకు మత్తుమందు ఇచ్చి రెండు రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై బాలికను అక్కడే వదిలేసి లాడ్జీ నుంచి వారు పరారయ్యారు. కుమార్తె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితులు బాలికకు తెలిసిన వారేనని పోలీసులు తెలిపారు. తెలిసిన వారు కావడంతో బాలిక వారి మాటలు నమ్మి వెంట వెళ్లినట్టు పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉన్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img